NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో గురువారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశామని అన్నారు.