NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లి గ్రామంలో మందిపల్లి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నారాయణపేట శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. రక్తదానం చేసిన యువకులని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ కొండయ్య పాల్గొన్నారు.