TG: హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం టెండర్లకు పిలిచినా, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేసినా హుజురాబాద్ ప్రజలు తిరగబడతారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు కూర్చుంటానని పేర్కొన్నారు.