ADB: బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమాలను గ్రామస్తులు గురువారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామస్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పల్లకి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించారు.