‘పళ్లిచట్టంబి’ మూవీలో బలశాలిగా కనిపించేందుకు తాను డైటింగ్‌ను పక్కనపెట్టి ఇష్టమైనవన్నీ తిన్నానని హీరో టొవినో థామస్ వెల్లడించాడు. విలన్‌ను ఒంటిచేత్తో విసిరేసే పాత్ర కోసం శారీరకంగా సిద్ధమయ్యానని తెలిపారు. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ ఆస్వాదిస్తున్నానని, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉండటం వల్లే నేరుగా తెలుగులో సినిమాలు చేయలేకపోతున్నానని వివరించారు.