సత్యసాయి: పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎండ తీవ్రతతో నీటి మట్టం తగ్గి ఆక్సిజన్ అందక చనిపోయాయా లేక డ్రైనేజీ వ్యర్థాలు నదిలో కలవడం వల్ల విషపూరితంగా మారి మరణించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.