NLR: బుచ్చి పట్టణంలోని మంగళ కట్టలో సురక్ష గ్రామ జ్యోతి కార్యక్రమానికి స్థానిక ప్రజలు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలకు మహిళలు బాలికల భద్రతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. లైంగిక దోపిడీకి గురవుతున్న గ్రామీణ బాలికలు స్త్రీలను రక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రైనింగ్ టూల్ కిట్‌ను స్థానిక ప్రజలకు అందజేశారు.