కోనసీమ: పి. గన్నవరం మండలం బెల్లంపూడిలోని ONGC బావి నుంచి స్వల్పంగా గ్యాస్ లీకవుతోందని, ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మూసివేసిన బావి వద్ద ఎటువంటి పైప్లైన్ లేవని, అంతా నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. అరికట్టేందుకు అమలాపురం, రాజోలు నుంచి రెండు అగ్నిమాపక వాహనాలను అక్కడే ఉంచినట్లు వెల్లడించారు