ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరు సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వీఆర్వో శివకుమార్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి క్రింద పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో కనిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.