AP: బాపట్ల జిల్లా చీరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం కాలనీ సమీపంలో వాడరేవు-పిడుగురాళ్ల హైవేపై ఆటో ఢీకొని ఇద్దరు మృతిచెందారు. రోడ్డుపై వెళ్తుండగా వారిపైకి ఆటో దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. మృతులను పెద్దలక్ష్మయ్య(68), సుబ్బారావు(60)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.