ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు నేడు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పురోహితుల రామకృష్ణ మీడియాతో తెలిపారు. గురువారం ఉదయం 10కు మడుగు తేరు కార్యక్రమం, సాయంకాలం ఐదు గంటలకు బ్రహ్మ రథోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.