PLD: యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు మద్దుల రమణారావును తెనాలిలో అరెస్ట్ చేసిట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 216 గ్రాముల వెండి, 14 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కనుమర్లపూడిలో దాచిన చోరీ సొత్తును సీజ్ చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.