అన్నమయ్య: పీలేరు మండలం కాకులారంపల్లి పంచాయతీ కోళ్ల ఫారం గ్రామానికి చెందిన తగిరి మోహనమ్మ (50) బుధవారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. మంటలు వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బంధువులు మంటలను ఆర్పారు. పాదాల నుంచి కడుపు వరకు తీవ్రమైన కాలిన గాయాలవడంతో మోహనమ్మను వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.