SRD: కంగ్టి మండల కేంద్రంలో సిద్దేశ్వర జాతర శిఖరోత్సవం కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. అశేష జనవాహిని నడుమ ఊరేగిన స్వామివారి శిఖరాన్ని, 30 అడుగుల ఎత్తులో ఉన్న రథంపై అదిరోహించారు. 108 కట్టెలు, ఐదు అంతస్తులు, ఒక్క ఇనుప మొల కూడా లేకుండా రథాన్ని తాళ్లతో బిగించారు. ఆరాధ్య దేవుడి శిఖరాన్ని ప్రజలందరూ దర్శించుకున్నారు.