ATP: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఎంపీలతో కలిసి చర్చలో పాల్గొన్న ఆయన, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు దక్కిన విజయమని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని ఇకపై ఎవరూ కదిలించలేరని ఆయన స్పష్టం చేశారు.