MBNR: పట్టణంలో హనుమాన్ జయంతి శోభాయాత్రలో డీజేల వినియోగంపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఒకటవ పట్టణ సీఐ అప్పయ్య డీజే నిర్వాహకులతో సమావేశమై, ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను అనుమతించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీజే యజమానులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.