KDP: కడప ఎయిర్పోర్ట్లో నారా భువనేశ్వరి గారికి ఘన స్వాగతం లభించింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవం కోసం వచ్చిన ఆమెకు టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనేశ్వరికి పూలమాలలతో ఘనంగా అభివాదం చేశారు.