TG: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి రేషన్ కార్డులను ప్రభుత్వం చూస్తోందని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు రేషన్ కార్డుల అంశం మారిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం కొత్తగా 5 లక్షల కార్డులు ఇస్తే.. పాతవి 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డులు తీసేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రేషన్ కార్డులను ఏరివేస్తే మరో ఉద్యమం చేస్తామన్నారు.