KDP: వీరపునాయిని పల్లె మండలం తలపనూరులోని గంగమ్మ అమ్మవారికి బుధవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితరు పూజలు చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.