NLG: వేసవి పండుగలు, తిరుణాళ్ల వేళ లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. బైకులు, ఖరీదైన బహుమతుల ఆశ చూపి బ్రోచర్ల ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి అనధికారిక లక్కీ డ్రా వ్యవస్థలను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.