AP: లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ MP మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. ‘విభజన వేళ APకి ఎన్నో హామీలు ఇచ్చాం. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు. కానీ సహకారం ఎక్కడ? ఇంకా ప్రత్యేక హోదా పెండింగ్లోనే ఉంది. అమరావతికి మద్దతుగా ఉంటాం.. న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాం’ అని స్పష్టం చేశారు.