SS: ధర్మవరంలోని 5వ వార్డు శారదా నగర్, అలాగే 30, 31వ వార్డుల దుర్గానగర్ ప్రాంతాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పింఛన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పింఛన్లు భరోసాను ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.