అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజల వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పలువురు ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.