SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఐకేపీ వివోఏలు మంగళవారం సమ్మె నిర్వహించారు. తమకు నెలకు రూ. 20 వేల జీతం ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అలాగే ఆరోగ్య భీమా సదుపాయం, 58 జీవో సవరణ, ట్యాబులకు నెట్వర్క్ కల్పించాలన్నారు.