GDWL: కేటీదొడ్డి మండల కేంద్రంలో ప్రజలకు ఇబ్బందిగా ఏర్పాటు చేసిన కంచెను తొలగించాలని గ్రామస్థులు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ఓ వ్యక్తి లే అవుట్ లేకుండా ప్లాట్లు విక్రయించాడని ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్లాట్లకు వెళ్లే మార్గంలో కంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కంచె తొలగించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.