WGL: రాయపర్తి మండల కేంద్రంలో వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఏసీపీ నరసయ్య మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలు, గొడవలు, బెదిరింపులు, భూకబ్జాలు, సంబంధిత నేరాలకు దూరంగా ఉండాలన్నారు.