Guinness World Records : ఏదైనా సాధించాలని ఊరికే అనుకోవడం కాదు.. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధించాలనుకునేది సాధించి తీరొచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. రెండు కాళ్లు లేకున్నా.. కేవలం చేతులతోనే అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతడే జియోన్ క్లార్క్. అతడు అందరిలా సాధారణంగా జన్మించలేదు. అరుదైన వ్యాధితో జన్మించాడు. రెండు కాళ్లు లేకుండా పుట్టాడు. అప్పటి నుంచి అతడు ఏ పని చేయాలన్నా చేతులతోనే.
తనకు రెండు కాళ్లు లేవని క్లార్క్ ఎప్పుడూ బాధపడలేదు. చిత్తశుద్ధితో తను ఏదైనా సాధించగలను అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి కఠోర శ్రమ చేయడం ప్రారంభించాడు. చేతులతోనే అన్ని పనులు చేసుకోవడం వల్ల అతడి చేతులు చాలా బలంగా మారాయి. దీంతో చేతులతోనే పరిగెత్తడం స్టార్ట్ చేశాడు.
Guinness World Records : 4.78 సెకన్లలో 20 మీటర్లు పరిగెత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
2021 లో క్లార్క్ దివ్యాంగ అథ్లెట్స్ పోటీలో పాల్గొని 20 మీటర్లను 4.78 సెకన్లలో ఛేదించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించాడు. 2022 లో మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డును క్లార్క్ సాధించాడు. ఇలా.. కేవలం చేతులతోనే సాధన చేసి కాళ్లు, చేతులు ఉన్న వాళ్లు కూడా సాధించలేని రికార్డులు సాధించి శెభాష్ అనిపించుకున్నాడు క్లార్క్. ఆయన సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్ట్ ప్రతినిధులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.