బెంగళూరులో దారుణం. 71 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు తన స్కూటీతో కిలో మీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన వెస్ట్ బెంగళూరులో మంగళవారం చోటు చేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తిని 25 ఏళ్ల సాహిల్‌గా గుర్తించారు. బాధిత వ్యక్తి ముత్తప్ప. ఇతనో కారు డ్రైవర్. ముత్తప్ప నడుపుతున్న ఎస్యూవీ కారును సాహిల్ వెనుక నుండి ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ముత్తప్ప ఆయన స్కూటీని వెనుక నుండి పట్టుకొని, ఆపివేసే ప్రయత్నం చేశాడు. ఆ వృద్ధుడు స్కూటీకి వేలాడుతూ ఉంటే, సాహిల్ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడే కానీ.. బండిని మాత్రం ఆపలేదు. మగాడి రోడ్డులో అలా ఒక కిలో మీటర్ మేర లాక్కెళ్లాడు. ఈ దారుణ సంఘటనను పలువురు వీడియో తీశారు. అలాగే, స్కూటీని ఆపేశారు.
ఒక ఆటో డ్రైవర్, బైక్ పైన ప్రయాణిస్తున్న మరో వ్యక్తి.. ఇలా కొంతమంది స్కూటీని ఆపే ప్రయత్నం చేశారు. సాహిల్ బండిని ఆపకపోయేసరికి, ఆటో వ్యక్తి ముందుకు తెచ్చి అడ్డుగా పెట్టి, నిలిపివేయించాడు. ఈ ఘటనలో ముత్తప్ప తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాహిల్ పైన గోవిందరాజ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిని అరెస్ట్ చేశారు. పోలీసులకు అప్పగించడానికి ముందే స్థానికులు సాహిల్‌ను కొట్టారు.