మార్చిలో కూడా 12 రోజుల పాటు బ్యాంకులు(Banks) మూత పడనున్నాయి. సెలవు రోజులు ముందుగానే తెలుసుకుంటే బ్యాంకు ఖాతాదారుల(Bank Customers)కు ప్రయోజనం ఉంటుంది. మరి మార్చిలో నెలలో బ్యాంకుల సెలవు రోజులు(Banks Holidays List) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి నెల ఇంకో ఐదు రోజుల్లో ముగుస్తుంది. ఈ ఐదురోజుల్లో ఫిబ్రవరి 25న నాలుగో శనివారం, 26న ఆదివారం కావడంతో బ్యాంకులు క్లోజ్(Banks close)లో ఉంటాయి. మార్చిలో కూడా 12 రోజుల పాటు బ్యాంకులు(Banks) మూత పడనున్నాయి. సెలవు రోజులు ముందుగానే తెలుసుకుంటే బ్యాంకు ఖాతాదారుల(Bank Customers)కు ప్రయోజనం ఉంటుంది. మరి మార్చిలో నెలలో బ్యాంకుల సెలవు రోజులు(Banks Holidays List) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి నెలలో బ్యాంకుల(Banks) సెలవుల జాబితాను ఆర్బీఐ తెలిపింది. ఆ జాబితా ప్రకారం మార్చిలో పండగలు, వారాంత సెలవులు కలుపుకుని మొత్తం 12 రోజులు బ్యాంకులు(Banks) మూతపడనున్నాయి. మార్చి 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు(Sundays) ఉంటాయి. మార్చి 11న రెండు శనివారం, 25న నాలుగో శనివారం కాబట్టి మొత్తం 6 రోజులు క్లోజ్ లో ఉంటాయి. ఇవే కాకుండా మార్చి నెలలో హోలీ, ఉగాది(Ugadi), శ్రీరామనవమి(Sriramanavami) పండగలు ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల పాటు బ్యాంకులు(Banks) మూతపడనున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 12 రోజులు బ్యాంకులు(Banks) మూతపడున్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 3 – చాప్చార్ కుట్ (మిజోరంలో జరుపుకునే పండగ) మార్చి 5 – ఆదివారం మార్చి 7 – హోలీ/ హోలికా దహన్/ ధూలండి/ డోల్ జాత్రా మార్చి 8 – హోలీ (రెండవ రోజు)/ ధూలేటి/ యోసాంగ్ (రెండవ రోజు- మణిపూర్) మార్చి 9 -హోలీ మార్చి 11 – రెండవ శనివారం మార్చి 12 – ఆదివారం మార్చి 19 – ఆదివారం మార్చి 22 – గుడి పడ్వా/ ఉగాది పండుగ/ తెలుగు నూతన సంవత్సర దినోత్సవం/ బీహార్ అవతరణ దినోత్సవం/ సాజిబు నొంగ్మపన్బా (మణిపూర్) మార్చి 25 – నాల్గవ శనివారం మార్చి 26 – ఆదివారం మార్చి 30 – శ్రీరామ నవమి