»A Fight Over A Dog In A Lift In Greater Noida Video Goes Viral
Viral video: లిఫ్ట్‌లో కుక్క కోసం లొల్లి..మహిళను కొట్టిన మాజీ ఐఏఎస్
ఓ మహిళ పెంపుడు కుక్కను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లిఫ్ట్‌లోకి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో ఆఫీసర్ చేతిలోని ఫోన్ మహిళ లాక్కోవడంతో అతను ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ క్రమంలో ఆమె భర్త వచ్చి అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A fight over a dog in a lift in Greater Noida.. Video goes viral
Viral news: పెంపుడు కుక్క(Dog)లను ఎంత ప్రేమగా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తమ శునకాన్ని లిఫ్ట్‌లోకి అనుమతించ లేదని ఓ అపార్ట్ మెంటులో గొడవ జరిగింది. ఆ క్రమంలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌తో గొడవ జరుగగా.. ఓ మహిళ అతని ఫోన్ లాక్కుని పడేసింది. దీంతో ఆ అధికారి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళ భర్త వచ్చి అతన్ని చితకబాదాడు. ఈ తంతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా(Greater Noida)లో జరిగింది.
గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 108లో ఉన్న పార్క్ లారేట్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కుక్కతో లిఫ్టులో వెళ్దామని బయలుదేరింది. అదే సమయంలో లిఫ్టులోకి వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ పీ గుప్తా వారిని లిఫ్టు నుంచి దిగి వెళ్లిపొమ్మన్నాడు. కానీ వారు వినలేదు. దీంతో అతను లిఫ్ట్ కదలకుండా అడ్డుగా నిలచున్నాడు. ఆ క్రమంలో ఇద్దరి మద్య దొడవ మొదలైంది. ఈ ఘటనను మరో యువతి తన ఫోన్లో చిత్రీకరిస్తుంది. గుప్త కూడా తన మొబైల్ బయటకు తీసి వీడియో తీయబోతుండగా గొడవ పడిన మహిళ ఆఫీసర్ ఫోన్ లాక్కుని బయటకు విసిరింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన మహిళపై చేయి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ క్రమంగా పెరగడంతో మహిళ భర్త వచ్చి గుప్తాపై దాడి చేశాడు. ఆ క్రమంలో అక్కడున్న సెక్యూరుటీ సిబ్బంది గమనించి ఆపారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకున్నారు.
There was again a dispute over a dog in the lift in Noida. Retired IAS officer R. P GUPTA accused of slapping a woman. Woman stopped for walking with dog, Retired IAS got furious when woman did not come out in lift, Controversy broke out over woman making video. pic.twitter.com/zFTgf8hEuf
— Save Children from #Stray_Dog_Menace (@IndianFightSdm) October 31, 2023