NLG: మునుగోడు మండలం రత్తిపల్లికి చెందిన పగిడోజు చండికాంబాకు ఆస్పత్రి వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.38,000 చెక్కును కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మాధగోని రాజేశ్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని భిక్షం గౌడ్, రసమల్ల వెంకన్న యాదవ్, తంగెళ్ల యాదగిరి రెడ్డి, తంగెళ్ల అంజి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.