»They Threatened To Chop Off Their Heads Bandi Sanjays Shocking Comments
Bandi Sanjay : తల నరుకుతామని బెదిరించారు..బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ బీజేపీ అగ్రనేత ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ఉన్నప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్ తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు.హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Bhagyalakshmi Temple) వద్ద బహిరంగ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని, కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని చెప్పారు. అయితే బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పాతబస్తీ (Old City) లో సభను నిర్వహించామని సంజయ్ తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి ధైర్యంగా పాతబస్తీలో సభను పెట్టామని చెప్పారు. బెదిరింపులకు భయపడకుండా చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని తెలిపారు.
పార్టీ కోసం తెగించి, ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు. కరీంనగర్(Karimnagar)లోని ఈఎన్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా తాను గెలిచానంటే అది కార్యకర్తలతోనేనని అన్నారు. ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ అంతా తిరిగి పేదల పక్షాన పోరాడానని, ఫాంహౌస్‌కు పరి మితమైన సీఎం కేసీఆర్ (CMKCR)ను ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చానని పేర్కొ న్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) కు కూడా తన మాదిరే ఎన్నో బెదిరింపులు వచ్చాయని.. ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ తెలిపారు. అయినా, రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. బీజేపీ(BJP) కి ఏడాది పాటు దూరమైనా..ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని కితాబిచ్చారు