చంపాపేట్‌కు చెందిన స్వప్న హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో కీలక విషయాలను బయటపెట్టారు పోలీసులు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధాకంగా ఇది హత్య కేసుగా నమోదు చేశారు.
Viral News: హైదరాబాద్(Hyderabad) చంపాపేట్(champapet)లో స్వప్న హత్య కేసు(swapna murder case)లో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని పోలీసులు పేర్కొన్నారు. మృతిచెందిన స్వప్న గతంలో సతీష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. తరువాత స్వప్నకు ప్రేమ్ కుమార్‌తో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లో ఉంది. సతీష్ స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. విషయం తెలిసిన ప్రేమ్ కుమార్ స్వప్నతో గొడవకు దిగాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న సతీష్ శనివారం ఉదయం చంపాపెట్లోని స్వప్నఇంటికి స్నేహితునితో కలిసి వచ్చాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని స్వప్న గొంతు కోసి హత్య చేశాడు. తరువాత ప్రేమ్‌ను రెండో అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు.
ప్రేమ్ కుమార్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి ఐసీయూలో ఉన్నాడు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది హత్యగా కేసు నమోదు చేశారు. ప్రేమ్ కుమార్ సృహాలోకి వస్తే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. దీనికి కారణం స్వప్న, సతీష్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడమేనని తెలుస్తోంది. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండొచ్చు.. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. మరొకరిని పెళ్లి చేసుకొని మాజీ ప్రియుడితో సంబంధాలు పెట్టకుంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయని ఈ ఘటన రుజువు చేసింది.