»That Is The Reason For The Vizianagaram Train Accident Many Trains Have Been Canceled Today
Vizianagaram రైలు ప్రమాదానికి కారణం అదే.. నేడు పలు రైళ్ల రద్దు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది.100 మందికిపైగా గాయపడ్డారు.
విజయనగరం (Vizianagaram) జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. 100 మందికిపైగా గాయపడ్డారు.నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం(Visakhapatnam)-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ఘోరట్రైన్ ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస(Palasa)-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (Rayagada) రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ (Signaling failure) కారణమని సమాచారం. సిగ్నల్ లోపం వల్లే విశాఖపట్టణం-పలాస, విశాఖ-రాయగఢ ఒకే ట్రాక్‌పై పరస్పరం ఢీకొన్నట్లు తెలుస్తోంది. భారత దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిషా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్(Train accident) తరహాలోనే ఈ ప్రమాదం సైతం జరిగినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ (PMModi) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు సీఎం జగన్ (CM Jagan) ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.