హైదరాబాద్ (Hyderabad) శివారులోని కోకాపేట యోపాలిస్ భుముల వేలం పాటలో ప్రభుత్వన్నికి కాసుల వర్షం కురిపిస్తోంది. నిధుల సమీకరణ కోసం హెచ్ఎండీఏ (HMDA) కోకాపేట నియోపోలిస్ లే-అవుట్లోని ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లోని భూముల విక్రయ ప్రక్రియను చేపట్టింది.అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికగా… అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది. కోకాపేట(Kokapet)లో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం నిర్వహించింది. ఇంకా మూడు ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా దాదాపు రూ. 2500 కోట్లు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు.
2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది. మొత్తంగా ఈ విడతలో కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది.రెండు సేషన్లు(Sessions)గా ల్యాండ్ వేలం జరుగుతుంది.సర్కార్ ఎకరాకు 35 కోట్లుగా ధర నిర్ధారించింది కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ(Drainage), మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్(Layout)లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.