Ex Minister Malla Reddy Approached Telangana High Court
Minister Mallareddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) గురించి పరిచయం అక్కర్లేదు. పాలు అమ్మినా, పూలు అమ్మినా అంటూ ఇటీవల హల్ చల్ చేశారు. ఏదో విధంగా రోజు వార్తల్లో ఉంటారు. హై కమాండ్ అండ దండలు ఉండటంతో మంత్రి (minister) నోటికి హద్దు లేకుండా పోతుంది. మల్లారెడ్డికి విద్యాసంస్థలు, ఆస్పత్రి ఉన్నాయి. ఇక మీడియా రంగంలోకి వస్తారట.. అంతే కాదండోయ్ సినిమాలు కూడా తీస్తారట.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మీడియా చానెల్ (channel) ఏర్పాటు చేస్తారట. దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ టీవీ చానెల్ ఏర్పాటు చేస్తారని.. తర్వాత పేపర్, లేదా డిజిటల్ మీడియా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సొంతంగా నమస్తే తెలంగాణ పేపర్, టీ న్యూస్ చానెల్ ఉంది. ఆ పార్టీకి చెందిన మంత్రి మరో న్యూస్ చానెల్ పెడతానని ప్రకటన చేశారు.
ఓ చానెల్ పెట్టి ఊరికే ఉండరట మల్లారెడ్డి (Mallareddy). తర్వాత తెలంగాణ నేపథ్యంలో సినిమాలు కూడా తీస్తారట. ఫోర్త్ ఎస్టెట్ అయిన మీడియాతోపాటు తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమాల నిర్మాణం చేపడుతారట. ఈ ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. తెలుగుదేశం పార్టీ ద్వారా మల్లారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేడ్చల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. విజయం సాధించారు. గెలిచిన ఫస్ట్ టైమే మల్లారెడ్డికి (Mallareddy) మంత్రిగా అవకాశం లభించింది.