హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ సిద్ధమైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది HMDA. ఆదివారం మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించనున్నారు. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు సంబంధించిన ఒక వీడియోను మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా షేర్ చేశారు. కాగా, ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి నార్సింగి, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి (Narsinghi) నుంచి కోకాపేట, వట్టినాగులపల్లి మీదుగా కొల్లూరు వరకు మొత్తం 23 కి.మీ దూరం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ (Solar) పవర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్ చేసి ఏర్పాటు చేశారు.
భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్
(Cycle track) హైదరాబాద్‌లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కి.మీ దూరంతో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చేపట్టింది. దీని తర్వాత రెండో పొడవైన సోలార్ రూఫ్ టాప్ మార్గం దక్షిణ కొరియాలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం కోసం కృషి చేసిన హెచ్ఎండీఏ అధికారులను అభినందించారు.ఈ సైకిల్ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ పవర్ (Solar power) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు మరియు సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. విశ్రాంతించేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు