నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా ‘అఖండ 2’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. 11 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.88.25 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి.