E.G: నరసాపురం మండలం ది సీతారాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని ప్రారంభించారు. ప్రజలందరూ ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి, ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.