CM KCR: తెలంగాణ గడ్డ మీద రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికను అన్నీ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. పాలమూరు, ఇందూరులో ప్రధాని మోడీ ఈ రోజు పర్యటించనున్నారు. మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కొన్ని వెలశాయి. దానికి కౌంటర్‌గా హైదరాబాద్‌లో కేసీఆర్‌కు (CM KCR) వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి.
బీఆర్ఎస్ అంటే డీల్ అని.. తెలంగాణలో అతి పెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని పోస్టర్ల ఉంది. ఈ కామర్స్ సైట్ స్నాప్‌డీల్‌ను పోలిన లోగోతో బీఆర్ఎస్ డీల్ అని రాసి ఉంది. ఓఎల్ఎక్స్ లోగోను పోలిన సోల్డ్ ఎక్స్ అని కూడా ఉంది. ఆ పోస్టర్ కనిపించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. బీజేపీ కాస్త బలహీనపడింది. ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చడం పెద్ద తప్పు అయిపోయిందని ఆనలిస్టులు చెబుతున్నారు. బండి సంజయ్ ఉంటే ఆ ఊపు వేరేలా ఉండేదని గుర్తుచేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ ముందు ఉంది. తర్వాత కాంగ్రెస్ కూడా ఖరారు చేయనుంది. చివరికీ బీజేపీ జాబితా ఉండనుంది.