Himanshu Rao: కల్వకుంట్ల హిమాన్షు రావు (Himanshu Rao).. సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు.. ఇతను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. చదువుకుంటూనే కవర్ సాంగ్స్ పాడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని.. కార్పొరేట్ స్కూల్‌గా ధీటుగా రూపొందించాడు. ఇప్పుడు ఓ ఫోటోను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేయగా.. ఆ ఫోటో ట్రోల్ అవుతోంది.
‘కొందరు తాము ఆరాధించే వ్యక్తులను ద్వీపాలలో చూస్తే.. మరికొందరు ఎడారుల్లో చూస్తారు.. తెలంగాణ రాష్ట్రంలో.. ప్రతి వ్యవసాయ క్షేత్రంలో తాను చూసింది ఇదే అంటూ ఫోటోను’ షేర్ చేశారు. ఆ వ్యవసాయ క్షేత్రం సీఎం కేసీఆర్ రూపంతో ఉంది. ఆ ఫోటోకు కేసీఆర్ వన్స్ అగైన్ అని ట్యాగ్ హిమాన్షు జతచేశాడు.
అది వరిసాగుకు సంబంధించి ఫోటో కాగా.. పచ్చిని పొలాల మధ్య కేసీఆర్ ఆకారంలో పంటను సాగు చేశారు. పై నుంచి తీసిన ఫొటో కేసీఆర్ ముఖచిత్రాన్ని పోలి ఉంది. చిత్రకారుడు పొలాల్లో కుంచెతో గీసిన చిత్రపటంలా ఉంది. సోషల్ మీడియా ఎక్స్‌లో హిమాన్షు షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. తక్కువ సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నేత మరొకరు లేరని సీఎం కేసీఆర్‌ను అంతా ప్రశంసిస్తున్నారు.
Some people see their idols in islands, while others see them in deserts, but I see mine in every farm field of Telangana#KCROnceAgainpic.twitter.com/1u642YkSH9
ఫోటోను అద్భుతంగా వర్ణించారని హిమాన్షుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఫోటో ఎక్కడ తీశారు.? లొకేషన్ ఏంటనే విషయాలు మాత్రం తెలియరాలేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు మనవడు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్ మాత్రం వేరేలా ఉంది.