Minister KTR : మా చెల్లి చాలా డైనమిక్.. కవితపై కేటీఆర్ ప్రశంసలు
మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను. ప్రజా జీవితంలో ఉండటం వల్ల నాన్న కేసీఆర్ ప్రభావం నాపై చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉండేది. నా చెల్లి కవిత చాలా డైనమిక్.. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్(Hyderabad)లో జరిగిన మహిళ సాధికారిత కార్యక్రమంలో తన ఫ్యామిలీ గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మా తల్లిని చూసి ఎంతో నేర్చుకున్నాం నా చెల్లి చాలా డైనమిక్ (Dynamic), మా కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతురాలు లేరు. ఇక నా భార్యకు ఓపిక ఎక్కువ. కూతురు పుట్టాక నా లైఫ్ మారిపోయింది అని పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయి. శిశుమరణాలను తగ్గించాం. స్త్రీ నిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. ఏపీ, తెలంగాణ (Telangana) మహిళలు స్త్రీ నిధి రుణాలు తీసుకుని 99 శాతం చెల్లిస్తున్నారు. ఆ రుణాలతో వాళ్లు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారు.
మేం మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన కొన్ని పథకాలు పూర్తిచేశాం.. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మహిళా యూనివర్సిటీ, కల్యాణలక్ష్మి(Kalyan Lakshmi), అమ్మఒడి వంటివి అందుబాటులోకి తీసుకొచ్చాం. నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నాం. సుల్తాన్పూర్, నందిగామ సహా మొత్తం నాలుగుచోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశాం. ప్రతిపక్షాలకు కూడా మేమే గెలుస్తామని తెలుసు.. కానీ వాళ్లు నటిస్తున్నారు’’ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. కోవిడ్ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా నిలిచారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు.