Breaking News : ధూమ్-2 మూవీ డైరెక్టర్ సంజయ్ గాధ్వీ మృతి
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన సంజయ్ గాధ్వీ.. హటాత్తుగా మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటులో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాధ్వీ (Sanjay Gadhvi) కన్నుమూశారు. ఉదయం వాక్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలారు.ఆస్పత్రి తరలించగాా అప్పటికే మరణించనట్లు వైద్యులు ధృవీకరించారు.ధూమ్, ధూమ్-2 (Dhoom-2 Movie) వంటి యాక్షన్ చిత్రలను ఆయన నిర్మించారు. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ కు తేరే లియే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. కిడ్నాప్(Kidnapping), మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2, వంటి యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం (Direction) వహించాడు. కాగా ధూమ్ సిక్వెల్స్ తో ఆయనకు హాలీవుడ్ రేంజ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. గుండెపోటుతో సంజయ్ గాధ్వీ.. ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు సంతాపం తెలుపుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బాలీవుడ్ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ముంబయి పని అయిపోయిందని, అందరికీ హైదరాబాదే దిక్కు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.