Babu Mohan : తండ్రి బీజేపీ అభ్యర్థి.. తనయుడు బీఆర్ఎస్లోకి
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రముఖ నటుడు, మాజీమంత్రి ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ (Babu Mohan) తనయుడు ఉదయ్ బీఆర్ఎస్లో చేరారు. ఆందోల్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయ్ బాబు కూమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. తండ్రి బాబు మోహన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీ(BJP)కి రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఉదయ్ బాబు మోహన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బాబు (Uday Babu) ఇవాళ గులాబీ గూటికి చేరారు. కాగా, ఈ ఎన్నికల్లో ఉదయ్ బాబు మోహన్ ఆందోల్ (Andol) నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశపడ్డారు, కానీ అధిష్టానం మాత్రం ఆయనకు టికెట్ నిరాకరించింది.
ఆందోల్ టికెట్‌ను తన తండ్రి, మాజీ మంత్రి బాబు మోహన్కే మరోసారి ఇచ్చింది. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉదయ్ బాబు మోహన్ బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీ(BRS party)లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆందోల్‌లో పార్టీ కేడర్ సపోర్ట్ చేయక సతమతమవుతోన్న బాబు మోహన్‌కు.. కొడుకు ఉదయ్ బాబు పార్టీ వీడటం భారీ ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి వరుస షాకులు తగులున్నాయి. వివిధ కారణాలతో కోమటిరెడ్డి (Komatireddy) రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి వంటి కీలక నేతలు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరగా.. తాజాగా కమలానికి మరో షాక్ తగలింది. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని మంత్రి హారీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.