»Shennys Palacios As Miss Universe First Nicaraguan Miss Record
Shannies Palacios : మిస్ యూనివర్స్‌గా షెన్నీస్ పలసియోస్..తొలి నికరాగ్వా భామగా రికార్డు
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిసింది.
మిస్ యూనివర్స్-2023 కిరీటాన్ని నికరగ్వే అమ్మాయి షెన్నీస్ పలసియోస్ (Shannies Palacios) గెల్చుకున్నారు. ఎల్ సాల్వేడార్లో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. పలసియోస్కు మాజీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించారు. రన్నరప్ గా థాయ్‌లాండ్ చెందిన ఆంటోనియో, మూడోస్థానంలో మొరయా విల్సన్(ఆస్ట్రేలియా) నిలిచారు. భారత్‌కు చెందిన శ్వేత శార్దా(Shweta Sharda)కు నిరాశే ఎదురైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది. తన పేరు ప్రకటించగానే షేనిస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అంతకుముందు కొన్ని క్షణాలపాటు ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. క్షణాలు ఉద్విగ్నంగా మారాయి.
అమెరికాకు చెందిన మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోనీ గాబ్రియెల్ (Bonnie Gabriel) విజేత షేనిస్‌కు కిరీటం తొడిగింది. మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో షేనిస్ మెరిసింది. ఆస్ట్రేలియాకు చెందిన మోరయ విల్సన్ సెకండ్ రన్నరప్‌గా నిలవగా, థాయిలాండ్ (Thailand) ముద్దుగుమ్మ అంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్‌గా ఎంపికైంది. మిస్ యూనివర్స్ 2023 అందాల పోటీల్లో చండీగఢ్‌కు చెందిన శ్వేత శారద భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. టాప్-20 ఫైనలిస్టుల్లోకి చేరినా ఆ తర్వాత వెనకబడింది. పాకిస్థాన్ (Pakistan) కూడా తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంది. ఈ 72వ మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో మొత్తం 84 దేశాల అందాల భామలు పాల్గొన్నారు. అమెరికన్ (American) టెలివిజన్ పర్సనాలిటీ జీనీ మాయ్, మిస్ యూనివర్స్ 2012 ఒలివియా కల్పోతోపాటు అమెరికన్ టీవీ ప్రజెంటర్ మారియా మెెనౌనోస్ ఈ పోటీలకు హోస్ట్‌గా వ్యవహరించారు.