»Trishas Bedroom Sin Missaiah Actor Mansoor Alis Shocking Comments
Leo Movie : త్రిషతో బెడ్రూమ్ సిన్ మిస్సయ్యా.. నటుడు మన్సూర్ అలీ షాకింగ్ కామెంట్స్
నటి త్రిషై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతని వ్యాఖ్యలపై మండిపడ్డారు. లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌పై కోలీవుడ్ తారలు ఫైరవుతున్నారు.
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) నటి త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.లియో సినిమాలో త్రిషను రేప్ చేసే సీన్ రానందుకు బాధపడ్డానంటూ మన్సూర్ అలీ ఖాన్ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై త్రిష (Trisha) కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అతడి వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి సెక్సిస్ట్‌గా, అగౌరవపూరితంగా, స్త్రీ ద్వేషంతో కూడినవిగా ఉన్నాయి. ఈ నీచమైన వ్యక్తితో ఇప్పటి వరకూ నటించనందుకు సంతోషపడుతున్నా. ఇకపైనా అతడితో నటించకుండాజాగ్రత్తపడతాను’ అని మండిపడ్డారు. విజయ్, త్రిష కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన మూవీ ‘లియో’(Leo Movie) లో మన్సూర్ అలీ ఖాన్ ఓ పాత్ర పోషించాడు. సినిమా హిట్ అయిన నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ సందర్భంగా త్రిషను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తన నీచత్వాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడు. ‘‘నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్రూం సన్నివేశం ఉంటుందని అనుకున్నా. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లొచ్చని భావించాను. నేను గతంలో చాలా సార్లు రేప్ సీన్లు (Rape scenes) చేశాను. ఇది నాకు కొత్తకాదు. అయితే, లియో కశ్మీర్ షెడ్యూల్ సెట్స్‌లో త్రిషను నాకు చూపించనే లేదు’’ అంటూ వెకిలి కామెంట్స్ చేశాడు. దీనిపై త్రిష మండిపడింది. ‘‘మన్సూర్ అలీ ఖాన్ నాపై చెత్త వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను అతడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి కామెంట్స్‌లో స్త్రీలపై వివక్ష, ద్వేషం, పురుష దురహంకారం కనిపిస్తున్నాయి.
ఇలాంటి చెత్త వ్యక్తితో ఎప్పటికీ నటించను’’ అని త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చింది.’లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటించా. కానీ సినిమాలో ఒక్క బెడ్రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్రూమ్కు తీసుకెళ్తానని అనుకున్నా. ఇంతకుముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్లో షూటింగ్ (Kashmir Shooting) జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌పై పలువురు తారలు మండిపడుతున్నారు. సింగర్ చిన్మయి (Singer Chinmai) శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి సినిమాల్లో ఎందుకు అవకాశాలిస్తున్నాంటూ నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.