చంద్రయాన్-3 విజయవంతం అవడంతో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తాంగా పెరిగింది. అదే ఉత్సాహంతో మరో రెండు ప్రయోగాలకు సంస్థ సిద్ధం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో చంద్రుడి మీద శాంపిల్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.
ISRO: భారతదేశం గర్వవించే విధంగా చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగం విజయవంతం కావడంతో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్లో పెరిగింది. ఇదే ఉత్సాహంతో తాజాగా మరో రెండు ప్రయోగాలకు ఇస్రో రెడీ అవుతోంది. లూపెక్స్(Lupex), చంద్రయాన్-4 మిషన్లకు సిద్ధమౌతోంది. వీటి ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయనుంది. ఇది చంద్రుడిపై అత్యంత చీకటి ప్రదేశం. ఇది శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగం అని, దీనికోసమే శాస్త్రవేత్తలు పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. చంద్రయాన్-4(Chandrayaan-4) మిషన్ చంద్రుడిపై దిగి, అక్కడి నుంచి శాంపిల్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.
చంద్రయాన్-2 విఫలం అయిన తరువాత పోయిన దగ్గరే వెతకాలన్న చందంతో జులై 14న చంద్రయాన్-3ను ప్రయోగించింది. ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తరువాత ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. ఆగస్టు 17న వ్యోమనౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. తరువాత కక్ష్యను తగ్గిస్తూ విజవంతంగా మిషన్‌ను ల్యాండ్ చేశారు. చంద్రుడిపై అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. అమెరికా, జపాన్, రష్యా దేశాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం పడలేదు. ఇది ఇస్రో చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది.