AP: కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రమాదకరమైన చట్టాలు చేసిందన్నారు. ఈ చట్టాలు ప్రజానీకానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అసంతృప్తి కలగకుండా ఉండేందుకు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని బీవీ రాఘవులు విమర్శించారు.