ఓ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు 30 వేల మంది అతిథులను ఆహ్వానించారు. మధ్యప్రదేశ్‌లోని సాంచి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌధరీ కుమారుడు పార్థ్ చౌధరీకి ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహ విందును ఎమ్మెల్యే కుటుంబం చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. 30 వేల మంది అతిథులకు 1000 మందికి పైగా వంటవాళ్లతో ప్రత్యేక వంటకాలు తయారు చేయించింది.