AP: జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని గోవిందరాజుస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం చేశారని ఆరోపించారు. బంగారు తాపడం సమయంలో గోల్ మాల్ జరిగిందని తెలిపారు. అన్యమతస్తులకు బంగారం తాపడం పనులిచ్చారని మండిపడ్డారు. గోపురంపైన విగ్రహాలు తొలగించి తాపడం చేశారని ధ్వజమెత్తారు. వీటిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు.